Share News

క్రీడలతోనే మానసికోల్లాసం

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:34 PM

క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుం దని టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌రావు, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని బొడ్డపాడులో అండర్‌-14 విభాగంలో కబడ్డీ,ఖోఖో,బ్యాడ్మింటన్‌ మండలస్థాయి పోటీలను ప్రారంభించారు.

క్రీడలతోనే మానసికోల్లాసం
క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న టీడీపీ నాయకులు

పలాస రూరల్‌, సెప్టెంబరు15(ఆంధ్రజ్యోతి):క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుం దని టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌రావు, టీడీపీ మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణకుమార్‌ తెలిపారు. సోమవారం మండలంలోని బొడ్డపాడులో అండర్‌-14 విభాగంలో కబడ్డీ,ఖోఖో,బ్యాడ్మింటన్‌ మండలస్థాయి పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత కిక్కర ఢిల్లీరావు, దుష్యంత్‌, కుమారరాజా, గ్రామపెద్ద తామాడ త్రిలోచనరావు, పీడీలు తవిటయ్య, పద్మలోచన పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:34 PM