Lok Adalat : లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:15 AM
Legal aid Justice for all లోక్ అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్‌మౌలానా అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా
2,826 కేసుల పరిష్కారం
శ్రీకాకుళం లీగల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): లోక్ అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్‌మౌలానా అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 19 బెంచ్‌లు ఏర్పాటు చేశామని, తద్వారా 2,826 కేసులు పరిష్కరించి నట్లు తెలిపారు. ఇందులో సివిల్, ప్రీలిటిగేషన్, మోటార్‌వెహికల్ బీమా కేసులు ఉన్నాయన్నారు. సుమారు రూ.7కోట్లు నష్టపరిహారంగా కక్షిదారులకు అంద జేసినట్లు చెప్పారు. జిల్లా కోర్టుకు వచ్చిన రెండు కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసుల్లో భార్యాభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించి రాజీకుదర్చడం తనకు ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయాధికారులు పి.భాస్కరరావు, సీహెచ్.వివేకానంద శ్రీనివాస్, ఫణికుమార్, ఎం.శ్రీధర్, శాంతిశ్రీ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాసు మెజిస్ర్టేట్ జమ్రత్ బేగం, జిల్లాబార్ అసోసి యేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తంగి శివప్రసాద్, పిట్టా దామోదర్, సీనియర్ న్యాయ వాదులు పాల్గొన్నారు.