లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:59 PM
లోక్‌అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నా రు.

టెక్కలి, జూలై 5 (ఆంధ్రజ్యోతి): లోక్‌అదాలత్‌తో కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల అన్నా రు. స్థానిక కోర్టు సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను రెండు బెంచ్‌లలో సీనియర్ సివిల్ న్యాయాధికారి బి.నిర్మల, జూనియర్ న్యాయాధికారి యు.నిర్మల నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు సివి ల్, 54 క్రిమినల్, ఏడు ఎక్సైజ్, మనోవర్తి, బ్యాంక్ రికవరీ కేసులు ఒక్కొ క్కటి పరిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్, అదాలత్ సభ్యులు దివాకర్, రమణారావు, శ్రీనివాసరావు, లీగల్ వలంటీర్ గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.
లోక్‌అదాలత్‌లో 248 కేసుల పరిష్కారం
పలాస, జూలై 5(ఆంధ్రజ్యోతి): స్థానిక మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా మున్సిఫ్ న్యాయాధికారి యు.మాధురి మాట్లాడుతూ.. అనేక కక్షిదా రుల సమస్యలు పరిష్కారమయ్యావన్నారు. 98 క్రిమినల్, 4 సివిల్, 146 నేరం అంగీకారం కేసులు పరిష్కారమయ్యావన్నారు. కార్యక్రమంలో కాశీ బుగ్గ సీఐ పి.సూర్యనారాయణ, ఏపీపీ రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయ్యజ్‌అహ్మద్, ఉపాధ్యక్షుడు బీకేఆర్ పట్నాయక్, జీఎంఎస్ అనిల్‌రాజు, అదాలత్ సభ్యుడు జి.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
నరసన్నపేటలో 155..
నరసన్నపేట, జూలై 5(ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్‌అదాలత్‌ను భాగంగా నరసన్నపేట జూనియర్ సివిల్ కోర్టులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 155 కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.వాణి తెలిపారు. సత్వర న్యాయంకోసం లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్య క్రమంలో ఏపీపీ గొండు సత్యనారాయణ, బార్ అసోయేషన్ అధ్యక్షుడు రావాడ కొండలరావు, న్యాయవాదులు ఆర్‌కె నాయుడు, జీవీజీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కోటబొమ్మాళిలో 152..
కోటబొమ్మాళి, జూలై 5(ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.రోషిణి శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 152 కేసులు పరిష్కారం అయ్యాయని కోర్టు సిబ్బంది తెలిపారు. వీటిలో సివిల్ నాలుగు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఒకటి, రెండు చెక్ బౌన్స్‌లు, 25 క్రిమినల్, ప్లీ బార్గైనింగ్ 35, క్రిమినల్ అడ్మినిషన్స్ కేసులు 85 పరి ష్కార మయ్యాయన్నారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు వెలమల అప్పలనాయుడు, పి.అర్జున రావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్. శ్రీనివా సులు, పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
పాతపట్నంలో 169..
పాతపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పాతపట్నం కోర్టు పరిధిలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను జూనియర్ సివిల్ న్యాయాధికారి మానెం రోషిణి నిర్వహించారు. ఈ సందర్భంగా 169 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. వీటిలో రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు 18, ప్రోనోట్ కేసులు 3, భార్యా భర్తల తగాదాలు 7, ప్రొహిబిషన్ ఎక్సైజ్ కేసులు 26, న్యూసెన్స్, పేకాట కేసులు-115 పరిష్కారమయ్యాయన్నారు. కార్యక్రమం లో పోలీస్, ప్రొహిబిషన్, ఎక్సైజ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురంలో 139..
ఇచ్ఛాపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి): జాతీయ లోక్ అదాలత్‌లో పెండిం గ్ కేసులను పరిష్కరించు కోవచ్చని జూనియర్ సివిల్ న్యాయాధికారి పరీష్‌కుమార్ అన్నారు. శనివారం మున్సిఫ్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా 139 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు. సీఐ ఎం.చిన్నంనాయుడు, ఎస్‌ఐలు ముకుందరావు, శ్రీనివాస రావు, న్యాయవాదులు యు.భారతి దివ్య, రమణయ్యరెడ్డి, రాంబాబు, రంగారావు, వేణు, కామేష్, భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
పొందూరులో 303..
పొందూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): స్థానిక జూనియర్ సివిల్ కోర్టు పరిధిలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 303 కేసులు పరిష్కారమయ్యాయి. జూనియర్ సివిల్ న్యాయాధికారి బి.జ్యోత్స్న ఆధ్వ ర్యంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. సమయం, డబ్బు వృథా కాకుండా ఉండాలంటే లోక్‌అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం పొందాలన్నారు. న్యాయవాదులు కె.రమణమూర్తి, కె.మంజుల, బ్రహ్మాజీ, సురేష్, కిరణ్, రమణమూర్తి పాల్గొన్నారు.