జల్‌జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:57 PM
జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): జల్‌జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. కుళాయి కనెక్షన్ ఇవ్వడం, సోర్స్ ఉన్న చోట నుంచి వేరే ప్రాంతానికి నీరు సరఫరా చేయడం, లేనిచోట కొత్త వాటి ని నిర్మించాలన్నారు. పనుల్లో ఎటు వంటి ఆలస్యం వహించవద్దన్నారు. జిల్లాలో 4,286 పను లకు అను మతి లభించగా ఇంతవరకు 749 పనులు భౌతికంగా, 304 పనులు ఆర్థికంగా పూర్తయ్యాయన్నారు. మరో 1811 పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ పనుల కోసం ఇప్పటికే రూ.825 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రతీ గ్రామంలో శతశాతం లక్ష్యాలు సాధిం చాల్సిందేనని స్పష్టంచేశారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ నాగేశ్వరరావు, ఈఈ పి.శంకరబాబు తదితరులు పాల్గొన్నారు.
కాలువల్లోని పూడికలు తొలగించాలి
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడిక లను తొలగించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం ఆయన నగరంలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. చాపురం-2 సచివాలయం పరిధిలోని డీసీ సీబీ కాలనీలో వీధులు, రామిగెడ్డ పరిసరాలు, కాలువలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామిగెడ్డ లో ఉన్న గుర్రపు డెక్కను తక్షణం తీయాలన్నారు. ఆయన స్వయంగా పర్యవేక్షించి కాలువల్లో పేరుకు పోయిన సిల్ట్‌ను తీయించారు. పీఎన్ కాలనీలోని కాలు వలు, అక్కడి నుంచి రైతుబజార్ కూడలి, మాధవ మోటార్సు జంక్షన్, డేఅండ్‌నైట్ సిగ్నల్ వరకు కాలువలు, రోడ్లను పరిశీలించారు. కాలు వల్లో మట్టి పేరుకుపో వడంతో వర్షపు నీరు రోడ్డు పైకి చేరుతోందని, కాలువల్లో చెత్త వేయవద్దని, ప్రతి ఒక్కరూ పరిసరాలను, రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మన ఆరో గ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, మునిసి పల్ హెల్త్ అధికారి సుధీర్ పాల్గొన్నారు.
నాగావళిలో వ్యర్థాలను వేయొద్దు
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): నగరంలోని నాగావళి నది వంతెన ఇరువైపులా ఆసు పత్రుల వ్యర్థాలను వేయవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్వచ్ఛ ఉత్సవ్‌లో భాగంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్క రించుకుని ‘ఏక్‌దిన్..ఏక్ గంట..ఏక్ సాథ్’ పేరుతో గురువారం నాగావళి నది ఒడ్డున చెత్త, కాలువల్లో పూడికలు తీసే కార్యక్రమం చేపట్టారు. నదీ తీరప్రాం తాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, హెల్త్ అఽధికారి సుధీర్, ఇంజినీర్ శ్రీనివాసులు, హార్టిక ల్చర్ అధికారి వరప్రసాద్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.