గణనాథునికి ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:39 PM
నగరంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీకాకుళం కల్చరల్ సెప్టెంబరు 2(ఆంధ్ర జ్యోతి): నగరంలోని ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయంలో వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశా రు. అర్చకులు ఆరవెల్లి శ్రీరామశర్మ ఆధ్వర్యంలో తమలపాకులతో అర్చన చేశారు. అలాగే పాల కొండ రోడ్‌లోని విజయ గణపతి ఆలయంలో విశేష పూజలు నిర్వ హించారు.
నేడు ఆలయ నూతన కమిటీ ప్రమాణం
నాగావళి నదీ తీరంలో ఉన్న ఉమారుద్ర కోటేశ్వర స్వా మి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఈవో మునగ వలస సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ చైర్మన్‌గా పాండ్రంకి దేవేంద్ర నాయుడుతో పాటు సభ్యులు ప్రమా ణం చేస్తారన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవు తున్నట్లు ఆమె తెలిపారు.
సామూహిక కుంకుమ పూజలు
కంచిలి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మఠం కంచిలిలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పలువురు మహిళలు కుంకుమార్చనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన చేపట్టారు.
షార్ట్‌ఫిల్మ్ విజేతలకు బహుమతులు
కవిటి, సెప్టెంబరు2(ఆంధ్రజ్యోతి): బొరివంక శ్రీబాల గణపతి వినాయక చవితి ఉత్స వాల సందర్భంగా నిర్వ హించిన షార్ట్ ఫిల్మ్ పోటీ విజేతలకు మంగళవారం బహు మతులు అందించారు. ఈ పోటీల్లో చిన్నకర్రివానిపాలేనికి చెందిన బన్నీటీమ్ ‘బివేర్’ ఫిల్మ్ ప్రథమ, ఎంఎస్‌పల్లికి చెందిన ‘తప్పెవరిది’కి ద్వితీయ, బొరివంకకు చెందిన ‘నాన్న మాట’కు తృతీయ బహుమతులు వచ్చాయి. అలాగే పలువురికి ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాంప్రసాద్, ఎంఈవోలు ధనుంజయ మజ్జి, ఎస్.రామ కృష్ణ, గెస్టు సంస్థ అధ్యక్షుడు బి.శంకరరావు, క్లబ్ అధ్యక్షుడు ఎల్.దీనబంధు తదితరులు పాల్గొన్నారు.