Share News

మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:29 PM

మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు.

మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, జూలై 26(ఆంధ్రజ్యోతి): మిస్సింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శని వారం పెండింగ్‌లో ఉన్న కేసులు, మిస్సింగ్‌ కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వర్క్‌లు, విజిబుల్‌ పోలీసింగ్‌, అవెర్నెస్‌ ప్రోగ్రాం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. గ్రేవ్‌ కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చార్జి షీట్‌లను కోర్టులో దాఖలు చేయాల న్నారు. గంజాయి, మద్యం, సారా, పశు వుల రవాణాపై నిఘా పెట్టి అక్రమ రవాణాను అరికట్టా లన్నారు. పోలీస్‌ అధికారులు ప్రతిరోజూ గ్రామాలు, పాఠ శాలలు, కళాశాలలను సందర్శించి నారీశక్తి సంకల్పం పేరిట మహిళా భద్రతా అంశానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి అవగాహన కలిగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో పారదర్శకంగా దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. వివిధ కేసుల్లో నిందితు లకు శిక్షలు పడేలా వాదించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రఘురాం, వివిధ కేసులను చేధించడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీఐలు ఇమ్మా న్యుయేల్‌ రాజు, అవతారం, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలిచ్చి అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ కేవీ రమణ, డీఎస్పీలు సీహెచ్‌ వివేకానంద, ఎంవీ అప్పారావు, డి.లక్ష్మ ణరావు, ప్రసాద రావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2025 | 11:29 PM