Share News

ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:14 AM

ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో గల ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించాలని ఎలియన్స్‌ క్లబ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు.

ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించండి
ఎస్‌ఐకు వినతి పత్రాన్ని అందజేస్తున్న సభ్యులు

ఇచ్ఛాపురం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో గల ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కరించాలని ఎలియన్స్‌ క్లబ్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ ముకుంద రావుకు వినతి పత్రాన్ని అందజేసి సమస్యలను వివరించారు. మైనర్‌ రడ్రైవింగ్‌, ఒకే బైక్‌పై ముగ్గురు చొప్పున ప్రయాణించడం, స్పీడ్‌గా వాహనా లను నడపడం, వాహనాల ధ్వని, కాలుష్యం, ఈవ్‌టీజింగ్‌ వంటి సమస్య లన్నీ పరిష్కరించాలని కోరారు. వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే సదస్సులు నిర్వహించామని, ఇంకా పూర్తిస్ధాయిలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు లోపింటి నరసింహమూర్తి, ఉపాఽధ్యక్షుడు ఉమాశంకర్‌, సభ్యులు బుజ్జి., యోగి, కె.నరసింహమూర్తి, రఘు, బాల, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 12:14 AM