Share News

కాలనీల ముంపు సమస్యను పరిష్కరించండి

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:41 PM

శ్రీకాకుళం నగరంలోని పలు కాలనీల్లో ముం పు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణం పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, పట్టణ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు, ఎం.గోవర్థన రావు డిమాండ్‌ చేశారు.

కాలనీల ముంపు సమస్యను పరిష్కరించండి
ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీపీఎం నేతలు

అరసవల్లి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని పలు కాలనీల్లో ముం పు సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, తక్షణం పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, పట్టణ కన్వీనర్‌ ఆర్‌.ప్రకాశరావు, ఎం.గోవర్థన రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమ వారం డీసీసీబీ కాలనీ, జగన్నాథనగర్‌, గోవిందనగర్‌, రామ్‌నగర్‌, ఇందిరానగర్‌, జగ్గయ్య కాలనీ, వంశధార కాలనీ, తిలక్‌నగర్‌ కాలనీ, కొన్నావీధి తదితర ముంపు కాలనీల్లో పర్య టించి సమస్యలను గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏమాత్రం వర్షం పడినా కాలనీల్లో నీరు బయటకు వెళ్లక నిలు వ ఉండిపోతోందని, ఖాళీ ప్రదేశాలు మురికి కూపాల్లా తయారవుతుండడంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి, ఎమ్మెల్యేలున్నా ఈ సమస్యకు పరిష్కారం చూపకపోవడం దారు ణమన్నారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనే జీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యుడు కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ అమ్మ న్నాయుడు, కె.సూరయ్య, ఎన్‌.అప్పన్న, కె. అప్పారావు, ఎం.ఆదినారాయణమూర్తి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:41 PM