Share News

సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:04 AM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఆర్‌ఎం టీచర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సమస్యలు పరిష్కరించండి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న సీఆర్‌ఎం టీచర్లు

కలెక్టరేట్‌ వద్ద సీఆర్‌ఎం టీచర్ల ధర్నా

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సీఆర్‌ఎం టీచర్లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఏపీ సీఆర్‌ఎం టీచర్స్‌ యునైటెడ్‌ ఫోరం అధ్యక్షుడు పోలాకి తవిటినాయుడు, ప్రఽధాన కార్యదర్శి బి.గిరిధర్‌ మాట్లా డుతూ క్లస్టర్‌ విధానాన్ని విరమించాలని, 9 ఏళ్లుగా పని చేస్తున్నా వేతనాలు పెరగలేదని, తక్షణం తగు చర్యలు తీసు కోవాలన్నారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మినిమం టైం స్కేల్‌ (ఎం టీఎస్‌) అమలుకు అసెంబ్లీలో ప్రకటించాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని, సర్వీసులను రెగ్యులర్‌ చేయా లని, చైల్డ్‌కేర్‌, ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. అంతకుముందు ఆర్‌అండ్‌డీ బంగ్లా నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ అధికా రులకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజే శ్వరరావు, సంఘం నాయకులు ఢిల్లీ శ్వరరావు, కె.రామకృష్ణ, డి.శ్రీనివాసరావు, టి.ప్రసాదరావు, పి. వైకుంఠరావు, జయలక్ష్మి, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 12:04 AM