నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:42 PM
ఎచ్చెర్ల నియో జకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు.
మంత్రి నారాయణకు ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ వినతి
రణస్థలం, జూలై 9(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల నియో జకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు బుధవారం మంత్రి నారాయణను అమరావతిలో కలిసి వినతిపత్రం అందించారు. శ్రీకాకుళం కార్పొ రేషన్‌లో ఉన్న కుశాలపురం, తోటపాలెం గ్రామాలను మళ్లీ పంచాయతీలుగా మార్చేందుకు గెజిట్ నోటిఫి కేషన్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. రావాడ, వెంకటరావుపేట పంచాయతీల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, కొవ్వాడ నిర్వాసితులకు ఆర్‌ఆర్ కాలనీ నిర్మించేందుకు చొరవ తీసుకోవాలని కోరా రు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎన్‌ఈ ఆర్ తెలిపారు.