ఘనంగా సామూహిక కుంకుమ పూజలు
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:30 PM
యారబాడు, దాసరివానిపేట గ్రామాల్లోని నీలమ్మతల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠోత్సవాల సందర్భంగా మంగళవారం సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు.
నరసన్నపేట, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): యారబాడు, దాసరివానిపేట గ్రామాల్లోని నీలమ్మతల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠోత్సవాల సందర్భంగా మంగళవారం సామూహిక కుంకుమ పూజలు చేపట్టారు. యారబాడులో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఆయా గ్రామాలకు చెందిన పెద్దలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
గారమ్మతల్లి ఉత్సవాలు..
కోటబొమ్మాళి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురంలో గారమ్మతల్లి ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మూడు లేదా ఐదేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఉత్సవాలను 60 కుటుంబాలు ఒకేసారి నిర్వహిస్తారు. డోకి మోహనరావు కుటుంబ సభ్యులు మొదట అమ్మవారికి ముర్రాటలు సమర్పించారు. రమణమూర్తి, గౌరి శంకర్, భాస్కర్ రావు, వీరభద్రరావు ఆధ్వర్యంలో అన్న సంతర్పణ చేపట్టారు.