మహిళలు ఆరోగ్యంతోనే సమాజాభివృద్ధి
ABN , Publish Date - Sep 29 , 2025 | 11:42 PM
మహిళలు ఆరోగ్యంపైనే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుందని నరసన్న పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు.
జలుమూరు (సారవకోట) సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆరోగ్యంపైనే సమాజాభివృద్ధి ఆధారపడి ఉంటుందని నరసన్న పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం సారవకోట మండలంలోని బుడితి సామాజిక ఆసుపత్రిలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఉచిత ఆరోగ్య వైద్యశిబిరాలు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పి.శంకరరావు, వైద్యాధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.