Share News

గంజాయితో స్మగ్లర్‌ అరెస్టు

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:46 AM

స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులో కర్ణాటక రాష్ట్రం జోకటి గ్రా మానికి చెందిన షా కత్‌ ఆలీ అనే గం జాయి స్మగ్లర్‌ మం గళవారం రాత్రి పట్టుబడినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు.

గంజాయితో స్మగ్లర్‌ అరెస్టు
మాట్లాడుతున్న సీఐ సూర్యనారాయణ

  • నిందితుడిది కర్ణాటక రాష్ట్రం

పలాస, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వే స్టేషన్‌ రోడ్డులో కర్ణాటక రాష్ట్రం జోకటి గ్రా మానికి చెందిన షా కత్‌ ఆలీ అనే గం జాయి స్మగ్లర్‌ మం గళవారం రాత్రి పట్టుబడినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన విలేకరులకు వివరిం చారు. బరంపూర్‌ (ఒడిశా)కు చెందిన అజయ్‌కుమార్‌ బెహరా నుంచి షాకత్‌ ఆలీ కిలో రూ.5వేలు మూడు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. దీనిని కర్ణాట కలో ఉన్న మహ్మద్‌ పర్వేజ్‌కు విక్రయించేందుకు మంగళవారం రాత్రి వస్తుండగా కాశీబుగ్గ ఎస్‌ఐ జి.నర్సింహమూర్తికి పట్టుబడ్డాడు. దీంతో అతడి నుంచి గంజా యితోపాటు మొబైల్‌ఫోన్‌, రూ.400 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితుడ్ని పలాస కోర్టులో హాజరుపరిచినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Oct 09 , 2025 | 12:46 AM