fishing harbor: ఫిషింగ్ హార్బర్‌కు స్థల పరిశీలన
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:32 PM
fishing harbor at budagatlapalem బుడగట్లపాలెం సముద్రతీరంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ఏపీ మారిటైమ్, సెంట్రల్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీ (సీఐసీఈఎఫ్) బృందం గురువారం పరిశీలించింది.
ఎచ్చెర్ల, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): బుడగట్లపాలెం సముద్రతీరంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ఏపీ మారిటైమ్, సెంట్రల్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీ (సీఐసీఈఎఫ్) బృందం గురువారం పరిశీలించింది. గతంలో ప్రతిపాదించిన అంచనాల్లో మార్పులు చోటుచేసుకోవడంతో కొత్త ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలించింది. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఎస్‌ఈ డాక్టర్ నగేష్, సీఐసీఈఎఫ్ డైరెక్టర్ డాక్టర్ రవిశంకర్, మత్స్యశాఖ డీడీ వై.సత్యనారాయణ, ఎఫ్‌డీవో రవి, సర్పంచ్ అల్లుపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.