Share News

వైభవంగా ‘సిరి’ సంబరం

ABN , Publish Date - May 06 , 2025 | 11:51 PM

బొబ్బిలిలో మంగళవారం గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమానోత్సం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ‘సిరి’ సంబరం
సిరిమానోత్సవంలో పాల్గొన్న భక్తులు

  • దాడితల్లి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

  • ఆకట్టుకున్న బళ్లు, జానపద వేషధారణలు

బొబ్బిలి/రూరల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): బొబ్బిలిలో మంగళవారం గొల్లపల్లి దాడితల్లి అమ్మవారి సిరిమానోత్సం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేకువ జామునుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరా రు. గొల్లపల్లిలోని ప్రధాన, బై పాస్‌ రోడ్డులో గల అమ్మవారి ఆలయాలు ఉదయం నుంచి రాత్రి వరకూ భక్తులతో కిక్కిరిసి పోయాయి. సిరిమాను పైల వీధి దాడితల్లి అంగడి నుంచి సాయం త్రం ఏడు గంటలకు బయలు దేరింది. అనువంశిక పూజారి బత్తేన కృష్ణ వేద పండితులతో పూజలు ముగిసిన అనంతరం సిరిమాను అధిరోహించారు. సిరిమాను రఽథం రాజవంశీయులు, ఎమ్మెల్యే బేబీనాయన కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆనవాయితీ ప్రకారం తూర్పు దిక్కుకు వెళ్లి మళ్లీ వెనక్కి వచ్చింది.అనంతరం కీడు రాయి దగ్గరికి మేళతాళాలతో ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున సిరిమానుపై చీరలు, కొబ్బరికాయలు, అరటి, మామిడి పళ్లను విసిరి మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది తమ చంటి పిల్లలను సిరిమానుకు తాకించి చల్లగా కరుణించు తల్లీ అని మొక్కుకున్నారు. బళ్లవేషాలు, జానపద వేష ధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బాణ సంచా కాల్చారు. భక్తుల కోసం ధార్మిక, స్వచ్ఛం ద సంస్థలు పలు కూడళ్లలో మజ్జిగ, తాగు నీరు, అల్పాహారం ఏర్పాటుచేశాయి. డీఎస్పీ భవ్య రెడ్డి, సీఐ కటకం సతీష్‌కుమార్‌, నారాయణరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసు సిబ్బందితో బందో బస్తు నిర్వహించారు. పట్టణంలోని వీధుల్లో భారీ పోలీస్‌ బందోబస్త్‌, రోప్‌ పార్టీ, వలంటీర్లు మధ్య సిరిమాను ఊరేగింపు కొనసాగింది.ఆకతాయిలు, జేబుదొంగలు, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ ఏడా ది అమ్మవారి సిరిమానోత్సవ బాధ్యతలను ఉత్సవ కమిటీ సభ్యులు మండల జనార్దనరావు, వజ్జి రవికుమార్‌, సర్వసిద్ధి సాయి హే మంత్‌లు కలిసి నిర్వహించారు. కాగా బుడా చైర్మన్‌ తెంటు లక్ష్ము నాయుడు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

బగ్గందొరవలసలో..

సీతానగరం, మే 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని బగ్గందొరవలసలో వివిధ గ్రామాల ప్రజల ఇలవేల్పుగా పూజించే కంతపోలమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఉత్సవ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో సోమవారం జాతర ప్రారంభం కాగా మంగళవారం సాయంత్రం పుర వీధుల్లో సిరి మానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా కోలాటం, తిరువీధి ఉత్సవంతో పాటు భాజా భజంత్రీలు, పులివేషాలతో విన్యా సాలతో అమ్మవారి ఘటాలను ఊరేగిం చారు. యువకులు వేసిన పులివేషాలు, బాలికల కోలాటం ఆకట్టుకున్నాయి. బుధవారం ఉదయం అనుపోత్సవం, మొక్కులు తీర్చు కోనున్నట్లు కమి టీ సభ్యులు తెలిపారు. అమ్మ వారిని పలు వురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సం ఘాల నేతలు దర్శిం చుకున్నారు.

Updated Date - May 06 , 2025 | 11:53 PM