ఘనంగా సిక్కోలు పుస్తక మహోత్సవం
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:59 PM
Book Festival శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంగళవారం రాత్రి సిక్కోలు పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై పుస్తక మహో త్సవాన్ని ప్రారంభించారు. పదిరోజులపాటు ఈ మహోత్సవం కొనసాగుతుంది.
జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆకట్టుకున్న ప్రదర్శన
శ్రీకాకుళం, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో మంగళవారం రాత్రి సిక్కోలు పుస్తక మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్యఅతిథిగా హాజరై పుస్తక మహో త్సవాన్ని ప్రారంభించారు. పదిరోజులపాటు ఈ మహోత్సవం కొనసాగుతుంది. తొలిరోజున.. తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ‘కాళీపట్నం రామారావు సాహిత్య వేదిక’ పేరుతో సిక్కో లు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వ హించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూఢనమ్మకాల నుంచి ప్రజ లను చైతన్యపరిచేలా మేకులపై భయం లేకుండా కూర్చోవడం.. గాజు పెంకులపై నిలబడటం... నక్షత్రాలు చూపించడం... వీటి వెనుక ఉన్న మర్మాలను జనవిజ్ఞానవేదిక సభ్యులు వివరిం చారు. ముఖ్యఅతిథులుగా పార్వతీపురం మాజీ ఎంపీ, డాక్టర్ డీవీజీ శంకర రావు, పలువురు రచయితలు, సాహతీ వేత్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సిక్కోలు టైగర్’ అనే పుస్తకాన్ని ఎమ్మెల్యే శంకర్, ‘నదికీ ఒక భాష ఉంది’ అనే పుస్తకాన్ని సాహితీవేత్తలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గొంటి గిరిధర్, నల్లి ధర్మారావు, పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.