Share News

సిక్కోలు ఉత్సవ్‌ విజయవంతం

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:56 PM

ఎన్‌టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌ ఎగ్జిబిషన్‌, సేల్‌తో పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

సిక్కోలు ఉత్సవ్‌ విజయవంతం
శ్రీకాంత్‌ బృందంచే శ్రీనివాస కల్యాణంలో ఓ ఘట్టం

అరసవల్లి/గుజరాతిపేట, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న సూపర్‌ జీఎస్టీ.. సూపర్‌ సేవింగ్స్‌ ఎగ్జిబిషన్‌, సేల్‌తో పాటు వివిధ సాంస్కృ తిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శనివారం రఘుపాత్రుని శ్రీకాంత్‌ శిష్య బృందంచే పలు నృత్య ప్రదర్శనలు, నృత్య రూపకాలు ఆకట్టుకు న్నాయి. అలాగే డీఆర్‌డీఏ సిబ్బందిచే జీఎస్టీపై అవగాహన రూపకం ఆకట్టుకుంది. కదిరెడి నరసింహుడు, కోలాటం, జోష్‌ శివ డ్యాన్స్‌ బృం దం నృత్యాలు, కర్రసాము, కోలాటం, లేజర్‌షో ఆకట్టుకున్నాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 11:56 PM