షట్టర్లు ఇలా.. సాగు నీరు ఎలా?
ABN , Publish Date - May 31 , 2025 | 12:17 AM
మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే వివిధ కాలువలపై దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన షట్టర్లు పాడైపోయాయి.
మరమ్మతులకు ఎదురుచూపు
పట్టించుకోని అధికారులు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
గార, మే 30(ఆంధ్రజ్యోతి): మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే వివిధ కాలువలపై దశాబ్దాల కిందట ఏర్పాటు చేసిన షట్టర్లు పాడైపోయాయి. సరైన నిర్వహణ లేక మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. మం డలంలో సుమారు 16 వేలు ఎకరాలకు సాగునీరు అందించే బైరి కాలువకు అనుబంధంగా ఉన్న శాలిహుం డం వమరవల్లి కళింగపట్నం, బూరవెళ్లి, అంబళ్లవలస, తోణంగి మొదలైన ప్రాంతాలకు సాగునీరు అందించే పిల్ల కాలువలకు నీరు వెళ్లేలా ఏర్పాటు చేసిన ఈ షట్టర్లు పూ ర్తిగా పాడైపోయాయి. ఫలితంగా ఖరీఫ్ సీజన్‌లో కాలువ లోకి నీరు చేరే సమయంలో షట్టర్లు పాడైపోయిన చోట నీరు వృథాగా కిందికి వెళ్లిపోతుంది. దీంతో సాగునీరు అం దక రైతులు ఇబ్బందిపడుతున్నారు. కొన్నిచోట్ల పాడైపో యిన షట్టర్లు వద్ద ఇసుక బస్తాలు, గడ్డితో కప్పి నీరు వృథాగా కిందకి పోకుండా తమ పొలాలకు మళ్లించుకుం టున్నారు. ఈ షట్టర్లను మరమ్మతులు చేయాలని సంబం ధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోతుం దని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైయినా సం బంధిత అధికారులు, పాలకులు స్పందించి పాడైన షట్ట ర్లకు మరమ్మతులు చేయించి ఖరీఫ్‌లో సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
సాగునీటి కాలువలు వద్ద రిపేర్లకు గురైన షట్టర్లు మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. ఖరీఫ్ సీజన్‌లో పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
- కె.క్రాంతి కుమార్, డిప్యూటి డీఈఈ, శ్రీకాకుళం