క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించండి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:41 PM
క్రీడాకారు లంతా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాణించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం స్పోర్ట్స్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): క్రీడాకారు లంతా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి రాణించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడి యంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ఆయన క్రీడా జ్యోతిని వెలిగించి బ్యాటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. టోర్నమెంట్‌లో మంచి ప్రతిభను కనబరిచి జాతీయ, అంతర్జా తీయస్థాయికి ఎదిగాలని కోరారు. కొన్ని ప్రత్యేక పరి స్థితుల్లో స్టేడియం పనులు నిలిచిపోయాయని, వీలైనంత వేగంగా పూర్తిచేసి క్రీడా కారులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీని వాసులు నాయుడు మాట్లాడుతూ.. ప్రభుత్వ పరంగా క్రీడల నిర్వహ ణకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తామ న్నారు. క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీవీఈవో విజయ్ కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం సలహ దారు పి.సుందరరావు, కార్యదర్శి ఎం. సాంబమూర్తి, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు బీవీ రమణ, స్వాతి, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.తవిటయ్య, ఎంవీ రమణ, కోశాధి కారి కె.మాధవరావు, గ్రిగ్స్ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.