అవసరం మేరకు యూరియా ఇవ్వరా?
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:53 PM
అవసరం మేరకు యూరియా ఇవ్వండి.. లేకుంటే బ్లాకులో మీరే అమ్ముకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సరుబుజ్జిలి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): అవసరం మేరకు యూరియా ఇవ్వండి.. లేకుంటే బ్లాకులో మీరే అమ్ముకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తకోట రైతు సేవా కేంద్రం వద్ద ఐదు గ్రామాల రైతులకు ఎరువు లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గం టల తరబడి క్యూలో ఉంచి ఆ తరువాత ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తామని సిబ్బంది చెప్ప డంతో రైతులు ఆగ్రహం చెందారు. ఒక బస్తా ఏ మేరకు ఉపయోగపడు తుందని అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో చాలా సేపు ఎరువులను పంపిణీ చేపట్టకపోవ డంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులతో వాగ్వా దానికి దిగారు. అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో పోలీ సులు రంగప్ర వేశం చేసి రైతులకు నచ్చజెప్పారు. కూటమి నేతలకు సంబంధించిన రైతులకు ఎటువంటి పరిమితి లేకుండా ఎరువులు అధికారులు ఇస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు.