Share News

శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలి

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:51 PM

తమ మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎల్‌ఎన్‌ పేట మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరావు

ఎల్‌ఎన్‌ పేట, ఆగష్టు 24(ఆంధ్రజ్యోతి): తమ మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎల్‌ఎన్‌ పేట మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కోరుతున్నారు. ఈ మేరకు మోదుగవలస జంక్షన్‌లో ఆదివారం వారంతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మండలాన్ని టెక్కలి రెవెన్యూ డివిజన్‌ నుంచి శ్రీకా కుళం రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు చేయాలని, కొత్తగా పలాస జిల్లా ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నందున, ఎన్‌ఎన్‌ పేట మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించేలా తీర్మానం చేసి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వ హించనున్న గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు అందిస్తామన్నారు. రాజకీయంతో సంబంధం లేకుండా మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులందరూ ఐకమత్యం గా మండలాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఉండేందుకు పనిచేసేందుకు నిర్ణయించా మన్నారు. సమావేశంలో వంశధార ప్రాజెక్టు జిల్లా నీటి సం ఘం అధ్యక్షుడు వి.ఆనందరావు, వివిధ పార్టీల నాయకులు ఎం.మనోహర్‌ నాయుడు, కె.చిరం జీవి, పి.విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:51 PM