Share News

నూర్పిడి యంత్రంలో షార్ట్‌సర్క్యూట్‌

ABN , Publish Date - Apr 20 , 2025 | 11:57 PM

హరిశ్చంద్రపురం పంచాయతీ సాలిపేట గ్రామంలో ఆదివారం వరి నూర్పిడి యంత్రంతో షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఇంజన్‌తో పాటు సమీపంలో ఉన్న వరి చేను కుప్పలు దగ్ధమయ్యాయి.

నూర్పిడి యంత్రంలో షార్ట్‌సర్క్యూట్‌
దగ్ధమవుతున్న నూర్పు యంత్రం, వరిచేను

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): హరిశ్చంద్రపురం పంచాయతీ సాలిపేట గ్రామంలో ఆదివారం వరి నూర్పిడి యంత్రంతో షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో ఇంజన్‌తో పాటు సమీపంలో ఉన్న వరి చేను కుప్పలు దగ్ధమ య్యాయి. మార్పు భూషణరావుకు చెందిన 1.30 ఎకరాల విస్తీర్ణంలోని వరిచేను కోతకోసి కుప్ప పెట్టి ఆదివారం నూర్పుకు సిద్ధమయ్యారు. నూర్పు ప్రారంభించిన కొద్ది సమయంలోనే మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. హరిశ్చంద్రపురం గ్రామ స్థుడు బల్లి అప్పలరాజుకు చెందిన ట్రాక్టర్‌, వరిచేను, పక్కన ఉన్న అవాల బారికివాడుకు చెందిన వరి గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల సమా చారం మేరకు స్థానిక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చినప్పటికే నష్టం వాటిల్లిపోయింది. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని సంబంధిత అధికారులు అంచనా వేశారు.

Updated Date - Apr 20 , 2025 | 11:57 PM