ఎస్‌హెచ్‌జీల లావాదేవీలు సరళతరం
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:52 PM
మన డబ్బు లు...మన లెక్కలు’ యాప్‌తో స్వయం సహాయ సంఘాల సభ్యుల లావాదేవీలు సరళతరం కానున్నా యని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం దూసి ఆర్‌ఎస్‌లో సెర్ప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘మన డబ్బు లు...మన లెక్కలు’ యాప్‌తో స్వయం సహాయ సంఘాల సభ్యుల లావాదేవీలు సరళతరం కానున్నా యని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం దూసి ఆర్‌ఎస్‌లో సెర్ప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలను ప్రారంభించింది సీఎం చంద్రబాబు అని అన్నారు. మహి ళలు ఆర్థిక లావాదేవీల్లో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రభుత్వం నూతనంగా ఈ యాప్ రూపొందించిందన్నారు. ప్రతి మహిళా ఒక వ్యాపారవేత్తగా ఎదగాలన్నది ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆకాంక్ష అన్నారు. అక్కివరంలో పశువైద్యశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన గాలికుంటువ్యాధి టీకాలు వేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో వెలుగు ఏపీఎం జి.నారాయణరావు, ఎంపీడీవో రోణంకి వెంకటరావు, పశు వైద్యాధికారి మెట్ట జోత్స్న, టీడీపీ మండల అధ్యక్షుడు నూకరాజు, నాయకులు బెండి రామ్మోహన్ రావు, కూన అమ్మాజీ పాల్గొన్నారు.
మహిళాభ్యున్నతే ధ్యేయం
ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్
లావేరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మహిళాభ్యున్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. లావేరులో సోమవారం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు ‘మన డబ్బులు..మన లెక్క లు’ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహి ళలు ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోం దన్నారు. ప్రధానమంత్రి తలపెట్టిన వికసిత్ భారత్‌లో భాగంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, సీఎం తలపెట్టిన విధంగా స్వర్ణాంధ్ర సాధనకు మనందరం కలిసి పనిచేయాలన్నారు. ప్రతీ 10 సంఘాలకు ఒక నారీశక్తిని నియమించడం జరుగుతుందన్నారు. వీరంతా నారీశక్తి యాప్ ద్వారా మన డబ్బులు- మన లెక్క లు తెలియజేస్తారన్నారు. అనంతరం పలువురికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కు లను అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ మం డల అధ్యక్షుడు ముప్పిడి సురేష్, తహసీల్దార్ జీఎల్‌వీ శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.వెంకటరాజు, ఏపీఎం సుబ్యయ్యనాయుడు, ఎంఎంఎస్ అఽధ్యక్షురాలు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.