శీముఖలింగేశ్వరాలయంలో శాంతిహోమం
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:22 PM
శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలోని డిండు విఘ్నేశ్వరుని సన్నిధిలో శాంతి హోమం నిర్వహించారు.
జలుమూరు, జూన్ 7(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలోని డిండు విఘ్నేశ్వరుని సన్నిధిలో శాంతి హోమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశారాధన, పరిషత్ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఔపాసనం, శాంతి హోమం చేశారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించారు. లోక కల్యాణార్థం శాంతి హోమం నిర్వహించినట్లు అర్చకులు నారాయణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.ప్రభాకరరావు, దేవాలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.
కాశీవిశ్వేశ్వరునికి ప్రత్యేక పూజలు
కొత్తూరు, జూన్ 7(ఆంరఽధజ్యోతి): కొత్తూరు మండలం మెట్టూరు, వసప గ్రామాల్లో ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాల్లో శనివారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి రూ.25వేలు అందజేశారు. వసప గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయం ముఖద్వార ప్రారంభోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్యక్ర మంలో వలు రౌతు సుధాకరరావు, వి.వెంకటరావు, పడాల లక్ష్మణరావు, అగతముడి గోవిందరావు తదితరలు పాల్గొన్నారు. అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి మెట్టూరు బిట్-2లో ఉమా కాశీ విశ్వేశర స్వామి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.