శంకరాభరణం శంకరశాస్త్రి సిక్కోలు వాసే!
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:27 AM
కళాకారుడు కడవరకూ కళాకా రుడేనని నిరూపించారు ఆ యన. నాటక, టీవీ, సిని మా రంగాలలో ఎనలేని కీర్తిని ఆర్జించిన ఆయన కళామ తల్లి ముద్దుబిడ్డ అనిపించుకు న్నారు.
‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులుగా గుర్తింపు
రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం
నేడు జేవీ సోమయాజులు జయంతి
ఎచ్చెర్ల, జూన్ 29(ఆంధ్రజ్యోతి): కళాకారుడు కడవరకూ కళాకా రుడేనని నిరూపించారు ఆ యన. నాటక, టీవీ, సిని మా రంగాలలో ఎనలేని కీర్తిని ఆర్జించిన ఆయన కళామ తల్లి ముద్దుబిడ్డ అనిపించుకు న్నారు. రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతలు నిర్వ ర్తిస్తూనే.. తనకు కళామ తల్లిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. ఉద్యోగ రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తనకు కళారంగంపై ఉన్న జిజ్ఞాసను ఏనాడూ వీడలేదు. ఆయన ఎవరో కాదు శంకరాభరణం శంకరశాస్త్రిగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జొన్నల గడ్డ వెంకట సోమయాజులు. 1979లో విడుదలైన శంకరాభర ణంలో శంకరశాస్త్రిగా నటించి తెలుగు సినిమా తెరపై పేరొందిన సోమయాజులు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు సమీపంలోని లుకలాం అగ్రహారం గ్రామంలో 1928 జూన్ 30న వెంకట శివరావు, శారదాంబ దంపతులకు జన్మించారు. విజయనగరంలో చదువుకున్న రోజుల నుంచి సోమయాజులు నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు.
కన్యాశుల్యం నాటకంతో..
సోమయాజులు తన తమ్ముడు రమణమూర్తితో కలిసి మహా కవి గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలో నటిం చి పేరు సాధించారు. రమణమూర్తి గిరీశంగా, సోమయాజులు రామప్పపంతులుగా నటించి నభూతో నభవిష్యతి అనిపించారు. 45 ఏళ్లలో 500 సార్లు కన్యాశుల్కం నాటకాన్ని నటించి రంజిం పజేశారు. 1953 ఏప్రిల్ 20వ తేదీన తొలిసారిగా కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. రామప్పపంతులుగా ధీర గంభీర స్వ రంతో సోమయాజులు అలరించారు. తొలుత వేదుల జగన్నాథం ప్రోత్సహంతో నాటకాల్లో నటించారు. అంతకుమునుపు 1946 నుంచి పెళ్లి పిచ్చి, దొంటాకం నాటకాల ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే నటనలో మరింత పదను పెట్టుకోవాలనే సంకల్పంతో మనిషిలో మనిషి, నాటకం, పంజరం, గాలివాన, కప్పలు నాటకాల్లో నటించారు. టెలివిజన్‌లో ప్రసారం కోసం కన్యాశుల్కాన్ని 13 భాగాల నాటకంగా రూపొందించారు. జంట నగరాల్లో నాటక కళ ప్రోత్సాహానికి రసరంజని అనే సంస్థను గరిమెళ్ల రామ్మూర్తి, చాట్ల శ్రీరాములు, రాళ్లపల్లి వంటివారితో కలిసి స్థాపించారు.
రారా కృష్ణయ్యతో వెండితెరపై..
నాటక రంగంపై అపార అనుభవం ఉన్న జేవీ సోమయాజులు రారా కృష్ణయ్య సినిమాలో 1979 తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాత 1979లో కె.విశ్వనాఽఽథ్ దర్శకత్వంలో రూపొందించిన శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రిగా సోమయాజులు అద్భుతంగా నటించి పేరుతెచ్చుకు న్నారు. శంకరాభరణం సినిమాలోని పాటలు ఎప్పుడు విన్నా వీనులవిందుగా ఉంటాయి. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వంశవృక్షం, త్యాగయ్య చిత్రాల్లో నటించారు. త్యాగ య్య సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, సోమయాజులుకు నటుడిగా గుర్తింపు తీసుకువచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 150 చిత్రాల్లో నటించారు.
డిప్యూటీ కలెక్టర్‌గా..
రెవెన్యూ శాఖలో అంచెలంచెలుగా ఎ దుగుతూ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎ దిగారు సోమయాజులు. మహబూబ్‌నగర్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమ యంలోనే ఆయనకు శంకరాభ రణంలో నటించే అవకాశం వచ్చిం ది. శంకరాభరణం సినిమాకు ముందు ఆయన యోగి దర్శకత్వంలో రారా కృష్ణయ్య సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఇది మంచి చిత్రమైనప్పటికీ ఆర్థికంగా విజయవంతం కాకపోవడంతో ఈ సి నిమా గురించి పెద్దగా చెప్పుకోలేదు. ప్రభుత్వ అనుమతి లేకుం డా సినిమాల్లో నటిస్తున్నారని ఆనాటి ముఖ్యమంత్రి మర్రిచెన్నా రెడ్డికి ఫిర్యాదులు అందడంతో ఆయన పరిశీలించి, కొత్తగా సాం స్కృతిక శాఖను ఏర్పరచి ఆ శాఖకు తొలి డైరెక్టర్‌గా నియ మించారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 55 తగ్గించడంతో ఆ ప్రభావం సోమయాజులుపై కూడా పడింది. దీంతో ఈయన సాంస్కృతిక డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో కళలశాఖకు అధిపతిగా నియమితులయ్యారు.
2004లో మరణం..
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శంకరభరణం శంకరశాస్త్రిగా పేరొందిన జేవీ సోమయాజులు 2004, ఏప్రిల్ 24న కళామతల్లి సేవకు సెలవు అంటూ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. రంగస్థలం, వెండితెర, బుల్లితెరలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సోమయాజులు సిక్కోలు గెడ్డపై జన్మించి ఈ ప్రాంతానికే పేరు తీసుకురావడం మనందరికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు.