Share News

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు శైలజ ఎంపిక

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:24 AM

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న గుమ్మడి శైలజ ఎంపికయ్యారు.

జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు శైలజ ఎంపిక
శైలజను అభినందిస్తున్న క్లబ్‌ ప్రతినిధులు

ఇచ్ఛాపురం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న గుమ్మడి శైలజ ఎంపికయ్యారు. గత నెల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌-19 స్కూల్‌ ఫెడరేషన్‌ పోటీల్లో సత్తాచాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ శిరీష తెలిపారు. ఢిల్లీలో ఈ పోటీలు ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు జరగనున్నాయ న్నారు. ఈ మేరకు శుక్రవారం అలియన్స్‌ క్లబ్‌ సభ్యులు బత్తుల వెంకటరమణ సౌజన్యంతో శుక్రవారం సురంగిరాజా మైదానంలో ఆమెను అభినందించి రూ.5 వేలు నగదు, స్విమ్మింగ్‌ డ్రస్‌ను అందించి అభినందించారు. కార్యక్ర మంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు జి.ఉమాశంకర్‌, వెంకట్రావు, మాజీ అధ్యక్షులు ఎల్‌.నరసింహమూర్తి, బి.వెంకటరమణ, క్లబ్‌ సభ్యులు యోగి, కె.నరసింహమూర్తి, సీహెచ్‌ వెంకటరమణ, బాల, కామరాజు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోటీ విజేతలకు అభినందన

ఆమదాలవలస, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయిలో జరిగిన హ్యాండ్‌బాల్‌ అండర్‌-19 విభాగంలో తొగరాం హైస్కూల్‌ విద్యార్థులు జిల్లా జట్టు తరపున పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ జట్టులో కీలకంగా వ్యవహరించిన పాఠశాలకు చెందిన విద్యార్థులు బంటుపల్లి అనుష్క, అన్నెపు అనూష, మనీషా, తమ్మినేని, దివ్య, కూన కార్తీక్‌, రామ్‌చరణ్‌, ఢిల్లీ శ్వరరావు, సతీష్‌, గుణశేఖర్‌లను శుక్రవారం పాఠశాలలో అభినందించారు. హెచ్‌ఎం ఎం.పోలినాయుడు, వ్యాయామోపాధ్యాయుడు జి.రాజశేఖర్‌ ఆధ్వ ర్యంలో విద్యార్థులను సత్కరించారు. భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, వైసీపీ నాయకుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:24 AM