రోడ్డుపై మురుగు.. రాకపోకలకు అవస్థలు
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:07 AM
మునిసిపాలిటీలోని పలుచోట్ల రహదారులపై మురుగునీరు చేరుతుండ డంతో రాకపోకలకు పాదచారులు, వాహ నచోదకులు అవస్థలకు గురవుతున్నారు. మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ జరిగినా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించలేదు. దీంతో వేసవిలో సైతం రోడ్డుపైకి పలుచోట్ల మురుగు నీరు చేరుతోంది. పలు ప్రాంతాల్లో మురుగునీరు వెళ్లేలా డ్రైనేజీవ్యవస్థను రూపకల్పనలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.
ఆమదాలవలస, ఏప్రిల్ 24 (ఆంధ్ర జ్యోతి): మునిసిపాలిటీలోని పలుచోట్ల రహదారులపై మురుగునీరు చేరుతుండ డంతో రాకపోకలకు పాదచారులు, వాహ నచోదకులు అవస్థలకు గురవుతున్నారు. మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ జరిగినా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించలేదు. దీంతో వేసవిలో సైతం రోడ్డుపైకి పలుచోట్ల మురుగు నీరు చేరుతోంది. పలు ప్రాంతాల్లో మురుగునీరు వెళ్లేలా డ్రైనేజీవ్యవస్థను రూపకల్పనలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రధానంగా ఎనిమిదేళ్లుగా పురపాలక సంఘం పాలకవర్గం లేకపోవడంతో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు.
ఇదీ పరిస్థితి
ఫఆమదాలవలసమునిసిపాలిటీలో 23 వార్డులకు గాను కొన్ని వార్డుల్లో ఇప్పటికీ పూర్తిస్థాయి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు నోచుకోలేదు. దీంతో నిత్యం వాడుక నీరు రోడ్లపైకి చేరుతోంది.
ఫ ఒకటో వార్డు పార్వతీశునిపేట ప్రాంతంలో మురుగు కాలువలు లేకపోవడంతో పరిసర ప్రాంత గృహాల వాడుకనీరు ప్రధాన రహదారిపై చేరడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి.శ్రీకాకుళం, సరుబుజ్జిలి, హిరమండలం వైపు రాకపోకలు సాగించే వాహ నాలకు ఆమదాలవలస పట్టణంలోనికి వెళ్లే ప్రఽధాన రహదారి కావడంతో రద్దీగా ఉంటోంది.ఈ నేపథ్యం లో రహదారిపై గుతుల్లో మురుగు నీరు చేరడంతో వాహనచోదకులు ఇబ్బందిపడుతున్నారు.
ఫఎనిమిదో వార్డు బొడ్డేపల్లి రాజగోపాలరావు నగర్ ఏర్పాటు 15 ఏళ్లు పూర్తికావస్తోంది. ఇప్ప టికీ పురపాలక సంఘం అక్కడ వీధుల్లో పక్కా రహ దారులు, మురుగుకాలువలు ఏర్పాటు చేయలేదు. కాలువలు లేకపోవడంతో మట్టి రహదారులపైనే మురుగునీరు చేరుతోంది. దీంతో దుర్వాసనతో ఇబ్బందిపడుతున్నారు.
ఫ12వవార్డు లక్ష్మీనగర్ వీధిలో నిరంతరం మురు గునీరు ప్రధాన రహదారిపైనే ప్రవహించడంతో మునిసిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.ఫ16వ వార్డు పూజా రిపేట సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైం ది.ఒకచోట మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నా యి.ఇక్కడి సమస్య పరిష్క రించాలని గతంలో అదే ప్రాంతానికి చెందిన కొంద రు ఎమ్మెల్యే కూన రవికుమార్ నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఫిర్యాదుచేసిన విషయం విదితమే.