Legal settlement: మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jul 09 , 2025 | 11:36 PM
Case resolution పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.
జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా
శ్రీకాకుళం లీగల్, జూలై 9(ఆంధ్రజ్యోతి): పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం దోహదపడుతుందని జిల్లా న్యాయాధికారి జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా మధ్యవర్తిత్వ ప్రక్రియను మరింత సమర్థంగా నిర్వహించాలని న్యాయవాదులకు తెలిపారు. మధ్యవర్తిత్వంలో కక్షిదారులతో ప్రవర్తించే తీరు, నడవడిక.. తదితర విషయాలపై తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారు. అనంతరం మధ్యవర్తిత్వం సీనియర్ ట్రైనర్ వి.పి.తనకచన్, పి.జి.సురేష్ మధ్యవర్తిత్వంతో ప్రయోజనాలు, ఎదురయ్యే సవాళ్లను చర్చించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు, మధ్యవర్తిత్వం న్యాయవాదులు పాల్గొన్నారు.