యూరియా కోసం పాట్లు
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:50 PM
ఎరువుల కోసం రైతులు పాట్లు పడుతున్నారు. యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- మండుటెండలో బారులుతీరుతున్న రైతులు
- పలుచోట్ల నిరసనలు, తోపులాటలు
ఎరువుల కోసం రైతులు పాట్లు పడుతున్నారు. యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటికోసం ఎరువుల దుకాణాల వద్ద మండుటెండలో బారులు తీరుతున్నారు. పలుచోట్ల తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. సక్రమంగా పంపిణీ చేయడం లేదంటూ రైతులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. యూరియా, డీఏపీ, గ్రోమోర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. యూరియా ఉంచుకునే వ్యాపారులు ఇవ్వడం లేదని అంటున్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కావాల్సిన ఎరువులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
-ఆంధ్రజ్యోతి బృందం