రైతులను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:43 PM
జిల్లాలో రైతులకు ఎరువులను సకాలంలో అందించాలని, వారిని నిర ్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మా జీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు ఎరువులను సకాలంలో అందించాలని, వారిని నిర ్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మా జీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహిం చిన గ్రీవెన్స్ సెల్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదావలస నుంచి రైతులు ఆవేదనను తెలిపేందుకు వస్తే పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. వినతిపత్రం అందజేసేందుకు కూడా అడ్డంకులు సృష్టించడం సబబు కాదన్నారు. అంతకుముందు కలెక్టరేట్ వద ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద ధర్నా నిర్వహించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించగా పోలీ సులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తర లించారు. పోలీసులను చూసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు మెల్లగా జారుకున్నారు.
నిరసనను అడ్డుకున్న పోలీసులు
ఆమదాలవలస, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ వద్దకు రైతులతో కలిసి వైసీపీ నేతలు నిరసన తెలిపేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ సమన్వ యకర్త చింతాడ రవికుమార్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠా యించి నిరసన తెలిపారు. ఎస్‌ఐ సనపల బాలరాజు ఆధ్వర్యం లో పోలీసులు బొడ్డేపల్లి పేట వద్ద ఉన్న ఆ పార్టీ కార్యాల యం ఎదుటే ఆయనను కదలకుండా అడ్డుకున్నారు.