విజ్ఞానాన్ని పెంచేందుకు సెమినార్‌లు దోహదం
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:53 PM
విద్యార్థుల్లో దాగి వున్న విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు సైన్స్ సెమినార్‌లు దోహదం చేస్తాయని డీఈవో ఎ.రవిబాబు అన్నారు.
గుజరాతీపేట, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో దాగి వున్న విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు సైన్స్ సెమినార్‌లు దోహ దం చేస్తాయని డీఈవో ఎ.రవిబాబు అన్నారు. నగరం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. విద్యార్థులు తయారుచేసిన పలు ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. ఇక్కడ విజేతలు ఈనెల 18న విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా ప్రతిభ కనబరచాలన్నారు. విజేతలకు బహుమతులను అందించి అభినందించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, జిల్లా సైన్స్ ఆఫీ సర్ ఎన్.కుమార్‌స్వామి, హెచ్‌ఎంలు పి.సతీష్‌కుమార్, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.