Share News

క్రీడలతో ఆత్మవిశ్వాసం

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:05 AM

క్రీడలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక గిరిజన సామాజిక భవన మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 69వ ఏపీ అంతర్‌ జిల్లాల క్రీడోత్సవాల్లో భాగంగా సాఫ్ట్‌ టెన్నీస్‌-2025 పోటీలు గురువారంతో ముగిశాయి.

క్రీడలతో ఆత్మవిశ్వాసం
విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • ముగిసిన అంతర్‌ జిల్లాల క్రీడాపోటీలు

పాతపట్నం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): క్రీడలు ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక గిరిజన సామాజిక భవన మైదానంలో గత మూడు రోజులుగా జరుగుతున్న 69వ ఏపీ అంతర్‌ జిల్లాల క్రీడోత్సవాల్లో భాగంగా సాఫ్ట్‌ టెన్నీస్‌-2025 పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజేతలు బహుమతులు, పోత్సాహకాలను అందజేసి మాట్లాడారు. క్రీడలతో ఆత్మవిశ్వాసం పెరిగి స్వీయక్రమ శిక్షణ నమన్వయ భావాలు ఉంటాయన్నారు. అండర్‌-14 బాలుర విభాగంలో గుంటూరు, తూర్పుగోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం జట్లు, బాలికల విభాగంలో కృష్ణ, విజయనగరం, చిత్తూరు, అనంతపురం మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అండర్‌-17 బాలుర విభాగంలో గుంటూరు, కృష్ణ, చిత్తూరు, విజయనగరం జట్లు, బాలికల నుంచి గుంటూరు, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, చిత్తూరు జట్లు వరుస నాలుగు స్థానాల్లో నిలిచాయి. అండర్‌-19 బాలుర విభాగంలో గుంటూరు, తూర్పుగోదావరి శ్రీకాకుళం, చిత్తూరు జట్లు, బాలికల నుంచి కృష్ణ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం విజయనగరం జట్లు నిలిచాయి.

బాలురు విభాగంలో..

అండర్‌-14 సింగిల్స్‌ బాలుర విభాగంలో ఎన్‌.క్రిష్‌ధరన్‌ రెడ్డి(కృష్ణ), ఎస్‌కే తంజేల్‌(కృష్ణ), జి.లెహేశ్వర్‌(గంటూరు), వి.మహిధర్‌ (విజయనగరం), ఎస్‌కే ఫాజల్‌(గుంటూరు), కె.జైదేవ్‌ (అనంతపురం), ఎస్‌కే ఉస్మాన్‌(చిత్తూరు), జైరామ్‌ (గుంటూరు), అండర్‌-17లో బీఎంఎన్‌వీ కార్తీక్‌(కృష్ణ), పీవీ సిన్హాస్‌(కృష్ణ), ఎస్‌.ఈశ్వర్‌ హితీష్‌(కృష్ణ), ఎస్‌కే అకియార్‌ అహ్మద్‌(గుంటూరు), ఎస్‌కే ఉమర్‌ అక్మల్‌ (చిత్తూరు), బి.జయసాయి కుమార్‌(చిత్తూరు), ఎ.లెవేంద్ర(శ్రీకాకుళం), ఎస్‌కే మహబాద్‌ సుబాయ్‌(గుంటూరు), అండర్‌-19లో రేవంత్‌(కృష్ణ), జీవన్‌(చిత్తూరు), సాయి లలిత్‌(గుంటూరు), ఎస్‌కే ఫాయిజ్‌ అహమ్మద్‌ (గుంటూరు), బాలాజిత్‌(చిత్తూరు), ఎల్‌వీఎస్‌ సందీప్‌ (తూర్ప్టుగోదావరి), త్రివిక్రమ్‌ (గుంటూరు), శ్రీధర్‌ (చిత్తూరు) విజేతలుగా నిలిచారు.

బాలికల విభాగంలో..

అండర్‌-14 సింగిల్స్‌ బాలికల విభాగంలో ఏఎస్‌ వైశాలి(కృష్ణ), కృష్ణ సత్యశ్రీ(గుంటూరు), చాందిని(చిత్తూరు), సంహిత(అనంతపురం), బ్లెస్సీ (తూర్పుగోదావరి), హంసిని(కృష్ణ), కారుణ్య(అనంతపురం), కావ్య(అనంతపురం), అండర్‌-17లో హాసిని(గుంటూరు), జె.సీతాపట్నాయక్‌(విశాఖ), నిత్య(కృష్ణ), జీరా మిజ్రా(శ్రీకాకుళం), జాహ్నవి (కృష్ణ), హేమశ్రీ(తూర్పుగోదావరి), నాగలాస్య(గుంటూరు), శ్రీవల్లి(శ్రీకాకుళం), అండర్‌-19లో బాలికల నుంచి కె.తనూశ్రీ (అనంతపురం), ఎ.దివ్యజ్యోతి (తూర్పుగోదావరి), చైతన్యశ్రీ(కృష్ణ), లక్ష్మీప్రసన్న(శ్రీకాకుళం), దేవీ ప్రసన్న(శ్రీకాకుళం), సీహెచ్‌ వీరశ్రావణి (తూర్పుగోదావరి), లీలామృత(కృష్ణ), నందిని(తూర్పుగోదావరి) విజేతలుగా నలిచారు. విజేతల వివరాలను రాష్ట్ర బాధ్యులు ఎన్ని శేఖర్‌బాబు వెల్లడించారు. ఈ పోటీల్లో సత్తాచాటినవారు మధ్యప్రదేశ్‌లో వచ్చే నెల 11,12,13వ తేదీల్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ నందిగామ ప్రసాద రావు, ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి, టీడీపీ నాయకులు టి.తిరుపతిరావు, పైల బాబ్జీ సైలాడ సతీష్‌ శాసనపురి మధుబాబు, క్రీడాసంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:05 AM