Share News

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:40 PM

రాష్ట్రస్థాయి పోటీలకు మాణిక్యపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక య్యారని హెచ్‌ఎం ఎం.వైకుంఠరావు తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

కవిటి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పోటీలకు మాణిక్యపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక య్యారని హెచ్‌ఎం ఎం.వైకుంఠరావు తెలిపారు. అండర్‌-17 బేస్‌బాల్‌ బాలురు, బాలికల పోటీలకు జయశ్రీ దొళాయి, జీతా నాయక్‌, కాళిదాసు సాహు, పి.వాసుదేవ్‌, వై.కార్తీక్‌, కరి ష్మా కుమారి సాహు ఎంపికయ్యారన్నారు. వీరంతా ఈనెల 27 నుంచి 29 వరకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరుగు పో టీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా మంగళవార పాఠ శాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

స్విమ్మింగ్‌ పోటీలకు..

ఇచ్ఛాపురం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు స్థానిక స్వర్ణభారతి పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 29, 30 తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్‌-14 విభాగంలో కౌశిక్‌, మదుమోహన్‌, యోగేష్‌, అండర్‌- 17 విభా గంలో సంతోష్‌ పాల్గొంటారన్నారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్‌ చాట్ల తులసీదాస్‌ రెడ్డి ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినం దించారు.

తెలుగు పరీక్షలో ఆదర్శ పాఠశాల విద్యార్థి ప్రతిభ

జి.సిగడాం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మన సంసృతి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 7న స్థానిక ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తెలుగు ప్రతిభ పరీక్షల్లో ఇదే పాఠశాలకు చెందిన విద్యార్థి డీవీ సుబ్బారావు ద్వితీయ స్థానం పొందాడని ప్రిన్సిపాల్‌ డి.గణేష్‌ పట్నాయక్‌ తెలిపారు. ఆరో తరగతి చదువుతున్న సుబ్బారావుకు డిసెం బరు 14న తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యా లయంలో జరుగు కార్యక్రమంలో బహుమతిని అందజేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు.

Updated Date - Nov 25 , 2025 | 11:40 PM