Share News

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:58 PM

రాజపురం ఏపీ మోడల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ నవీన్‌కుమార్‌ పాణిగ్రాహి తెలిపారు.

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
లావేరు: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో ఉపాధ్యాయులు

కవిటి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాజపురం ఏపీ మోడల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్‌ నవీన్‌కుమార్‌ పాణిగ్రాహి తెలిపారు. అండర్‌-19 వాలీబాల్‌ విభాగంలో బి.జ్ఞానేశ్వరరావు, ఎ.సంజయ్‌, ఎస్‌.పార్వతి, క్రికెట్‌ లో ఇ.మహేష్‌, ఎం.అవినాష్‌, కబడ్డీలో జి.దీపిక, వాలీబాల్‌ అండర్‌-17 విభాగంలో డి.యమున, అండర్‌-14లో బి.సంతోష్‌ ఎంపికయ్యారని చెప్పారు. అలాగే బ్యాడ్మింటన్‌లో ఎ.తమన్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈమేరకు గురువారం విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

పతకం సాధించిన విద్యార్థికి అభినందన

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలో పతకం సాధించిన కె.శిరీషను ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బి.అశోక్‌ గురువారం రామయ్య పుట్టుగలో అభినందించారు. 38వ జూనియర్‌ స్టేట్‌మీట్‌లో 3 వేల మీటర్లు స్ట్రెప్లెచేజ్‌లో పతకం సాధించడం అభినందనీ యమన్నారు. ఎస్‌వీజే పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

లావేరు పాఠశాల నుంచి..

లావేరు, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ పోటీలకు లావేరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులు ఎంపికైనట్లు హెడ్‌మాస్టర్‌ పి.జగన్నాఽథ రావు తెలిపారు. ఇటీవలన జిల్లాస్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. 200 మీటర్ల పరుగు పందెంలో వై.రఘు, త్రోబాల్‌లో బి.తనూజ, వై.రఘు, వాలీబాల్‌లో వై.మహేష్‌ ఎంపికకయ్యారని చెప్పారు. బేస్‌బాల్‌ పోటీల్లో ఎ.జీవిత, ఎల్‌.లక్ష్మి, ఎ.భాను ప్రసాద్‌, ఎన్‌.ధనుష్‌, వె.ౖ కృష్ణ, ఎన్‌.రామకృష్ణ, ఎన్‌.కిషోర్‌, వై.రఘు, ఎస్‌.గోవింద ఎంపి కైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థు లను ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఐ.తోటయ్యదొర, ఎస్‌ఎంసీ చైర్మన్‌ లంకలపల్లి రాంబాబు, హెచ్‌ఎం జగన్నాథరావు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ అధ్యక్షుడు పిసిని వసంతరావు తదితరులు అభినందించారు.

Updated Date - Oct 09 , 2025 | 11:58 PM