జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Nov 11 , 2025 | 11:59 PM
హర్యానా రా ష్ట్రం పానిపట్‌లో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగ నున్న సబ్ జూనియర్ జాతీ య స్థాయి కబడ్డీ పోటీల్లో పా ల్గొనే రాష్ట్ర జట్టుకు కోటబొ మ్మాళి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చీరు చంద్రలేఖ, పాత్రుని గీతిక ఎంపికైనట్టు ఎంఈవో డి.గో విందరావు మంగళవారం తెలిపారు.
కోటబొమ్మాళి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): హర్యానా రా ష్ట్రం పానిపట్‌లో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు జరగ నున్న సబ్ జూనియర్ జాతీ య స్థాయి కబడ్డీ పోటీల్లో పా ల్గొనే రాష్ట్ర జట్టుకు కోటబొ మ్మాళి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు చీరు చంద్రలేఖ, పాత్రుని గీతిక ఎంపికైనట్టు ఎంఈవో డి.గో విందరావు మంగళవారం తెలిపారు. వీరి ఎంపికపై వ్యాయామ ఉపాధ్యాయులు వాసుదేవరావు, ఎస్.గణేష్, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ బోయిన వెంకటరమణ అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్లు
కడప జిల్లా పులివెందులలో ఈనెల 7నుంచి 10వ తేదీ వరకు జరిగిన 35వ రాష్ట్రస్థాయి బాల, బాలికల సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం బాలికల జట్టు ప్రథం స్థానంలో నిలువగా, బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించింది. వీరికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందనలు తెలిపారు. ఈ విజయంలో కోటబొమ్మాళి జడ్పీ పాఠశాల విద్యా ర్థులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఎంఈవో తెలిపారు.