అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:58 PM
అక్రమంగా తరలిస్తున్న కలపను కేశవ రావుపేట జంక్షన్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు వేబ్రిడ్జి వద్ద శనివారం విజిలెన్స్, అటవీ శాఖాధికారులు చేపట్టిన తనిఖీల్లో పట్టుకున్నారు.
రూ.1,16,058 విలువైన అకేష్ దుంగల స్వాధీనం
ఎచ్చెర్ల, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): అక్రమంగా తరలిస్తున్న కలపను కేశవ రావుపేట జంక్షన్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు వేబ్రిడ్జి వద్ద శనివారం విజిలెన్స్, అటవీ శాఖాధికారులు చేపట్టిన తనిఖీల్లో పట్టుకున్నారు. రెండు లారీలు, రెండు వ్యానుల్లో 39.970 టన్నుల బరువు కలిగిన రూ.1,16,058 విలువైన అకేసి దుంగల కు ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న కలపతోపాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు విజిలె న్స్ ఎస్‌ఐ రామారావు, అటవీ శాఖాధికారి రాజశేఖర్ తెలిపారు. అక్రమ తరలింపు నకు బాధ్యులైన వారిపై ఏపీ ఫారెస్ట్ చట్టం 1967, ఏపీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్సి ట్ రూల్స్ 1970 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తనిఖీల్లో విజిలె న్స్, ఫారెస్ట్ సిబ్బంది ఈశ్వరరావు, కన్నబాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.