సమయపాలన పాటించని సచివాలయ ఉద్యోగులు
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:50 PM
మునిసిపా లిటీ పరిధిలో ఉన్న వార్డు సచివాలయా ల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వివిధ పనులపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయ పాలన పాటించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెట్టక్కివలసలో స్థానికుల ఆగ్రహం
చర్యలు తీసుకుంటామన్న కమిషనర్ రవి
ఆమదాలవలస, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మునిసిపా లిటీ పరిధిలో ఉన్న వార్డు సచివాలయా ల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వివిధ పనులపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమయ పాలన పాటించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్టక్కివలస సచివాలయ సిబ్బంది మంగళవారం ఉదయం 10.45 గంటలకు కూడా రాకపో వడంతో స్థానికులు టీడీపీ నేతలు నాగళ్ల మురళీధర్ యాద వ్, మునగవలస రవీంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. గృహ నిర్మాణాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకునేందుకు సచి వాలయానికి వెళితే సిబ్బంది లేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే టీడీపీ నేతలు సచివాలయానికి చేరు కోగా 11 గంటల సమయంలో ఒక ఉద్యోగి వచ్చి సచివాలయ తలుపులు తీశారు. పట్టణ పరిధిలోని 10, 11 వార్డులకు సేవలందించాల్సిన ఈ వార్డు సచివాలయంలో 8 మంది ఉద్యోగులు ఉండగా కేవలం ము గ్గురు మాత్రమే విధులకు ఒక్కొ క్కరుగా వచ్చారు. దీనిపై నేతలు కమిషనర్ రవికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన సచివాల యానికి వచ్చి ఉద్యోగుల హాజరు పట్టి, రికార్డులను పరిశీలించారు. ఐదు గురు ఉద్యోగులు విధులకు హాజ రుకాలేదని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రజలు శాంతించారు.