గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
ABN , Publish Date - May 31 , 2025 | 11:27 PM
శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో నివసి స్తున్న సచివాలయ ఉద్యోగి పల్లె దాలి నాయుడు (30) శనివారం వేకువ జామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు.
శ్రీకాకుళం క్రైం, మే 31(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో నివసి స్తున్న సచివాలయ ఉద్యోగి పల్లె దాలి నాయుడు (30) శనివారం వేకువ జామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దాలినా యుడు శ్రీకాకుళం సానావీధి సచివాలయంలో ఎమిని టీస్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. పింఛన్ల పంపిణీ 31న పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో శనివారం ఉదయం 4.30 గంటలకు భార్య మాధురి నిద్రలేపింది. ఎంతకీ మెలుకవలోకి రాక పో వడంతో ఆవేదనకు గురై పక్క రూమ్‌లో ఉంటున్న అత్తామామలకు తెలపగా వారు వచ్చి చేసేసరికే దాలినాయుడు నోటి నుంచి నురగలు రావడంతో మృతి చెందినట్లు భావించారు. రూరల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రాముకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి ఎస్‌ఐ రాము దర్యాప్తు చేపట్టారు. జలుమూరు మండలం చల్లపేటకు చెందిన పల్లె దాలినాయుడు ఉద్యోగ రీత్యా శ్రీకాకుళం రూరల్ మండలం ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్నాడు.
.
అధికంగా మద్యం తాగి వ్యక్తి మృతి
టెక్కలి, మే 31(ఆంధ్రజ్యోతి): కోటబొ మ్మాళి మండలం సాలిపేట గ్రామానికి చెందిన చలపాకల తారకేశ్వరరావు (40) శనివారం మద్యం ఎక్కువగా తాగి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మృతిచెందా డు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ విజయ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి వివ రాలు ఆరా తీసి ఆ కుటుంబానికి మృత దేహాన్ని అప్పగించారు.