Share News

బ్యాలెట్‌ బ్యాక్స్‌లతో రహస్య ఓటింగ్‌

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:56 PM

నగరంపల్లి హైస్కూల్‌లో సోమవారం రహస్య ఓటింగ్‌ పద్ధతిలో విద్యార్థి నాయకుడికోసం ఎన్నిక నిర్వహించారు.

  బ్యాలెట్‌ బ్యాక్స్‌లతో రహస్య ఓటింగ్‌
క్యూలైన్‌లో నిలబడి ఓటు వేస్తున్న విద్యార్థులు:

వజ్రపుకొత్తూరు, జూలై 14 (ఆంధ్రజ్యోతి):నగరంపల్లి హైస్కూల్‌లో సోమవారం రహస్య ఓటింగ్‌ పద్ధతిలో విద్యార్థి నాయకుడికోసం ఎన్నిక నిర్వహించారు. విద్యార్థులకు ప్రజాస్వామ్యం గొప్పతనం తెలియజేయాలన్న ఉద్దేశంతో రహస్య ఓటింగ్‌ నిర్వహించినట్లు హెచ్‌ఎం టి.హేమారావు తెలిపారు. ఈ సందర్భంగా బాలబాలికలకు వేర్వేరు ఓటు వేసేందుకు బ్యాలెట్‌ బ్యాక్సులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు విద్యార్థి నాయకుడిగా బి. సుమన్‌ ఎన్నికైనట్లు హెచ్‌ఎం ప్రకటించారు. ఎన్నికలఅధికారులుగా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు కె.రమణ, టి .కమలకుమారి వ్యహరించారు, కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ బి.లక్ష్మీపతి పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 11:56 PM