Share News

గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:43 PM

: మండలంలోని నాగావళి నదిలో గల్లంతైన రైతు కూలి కొక్కిరాల నారా యుడు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నా యి.

గల్లంతైన వ్యక్తి కోసం   కొనసాగుతున్న గాలింపు
గాలింపు చర్యలు చేపడుతున్న దృశ్యం:

ఆమదాలవలస, అక్టోబ రు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నాగావళి నదిలో గల్లంతైన రైతు కూలి కొక్కిరాల నారా యుడు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నా యి. కనుగులవలసకు చెందిన నారాయుడు నాగావళి నదిలో ప్రమాదవశాత్తూ గల్లంతైన విషయం విదితమే. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసిన అధికారులు రెండు రోజులుగా నారాయుడు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆదివారం కూడా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది దూసి రైల్వే బ్రిడ్జి సమీపంలో గాలించారు. నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో బృందాల గాలింపునకు అవాంతరాలు ఎదురవుతున్నాయని తహసీల్దార్‌ రాంబాబు తెలిపారు.

Updated Date - Oct 05 , 2025 | 11:43 PM