బెజ్జిపురంలో స్క్రబ్‌టైఫస్
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:21 AM
Scrub typhus లావేరు మండలం బెజ్జిపురంలో ఓ వృద్ధుడికి(64) స్క్రబ్‌టైఫస్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆ వృద్ధుడికి పది రోజుల కిందట కళ్లం వద్ద పేడపురుగు కుట్టింది. అప్పటి నుంచి తరచూ జ్వరం వచ్చి తగ్గుతుండేది. ఈ నెల 10న గ్రామానికి 104 వాహనం రాగా.. ఆ వృద్ధుడు రక్త పరీక్షలు చేయించుకున్నారు.
వృద్ధుడికి వ్యాధి నిర్ధారణ
లావేరు, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): లావేరు మండలం బెజ్జిపురంలో ఓ వృద్ధుడికి(64) స్క్రబ్‌టైఫస్ వ్యాధి నిర్ధారణ అయింది. ఆ వృద్ధుడికి పది రోజుల కిందట కళ్లం వద్ద పేడపురుగు కుట్టింది. అప్పటి నుంచి తరచూ జ్వరం వచ్చి తగ్గుతుండేది. ఈ నెల 10న గ్రామానికి 104 వాహనం రాగా.. ఆ వృద్ధుడు రక్త పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు స్క్రబ్‌టైఫస్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు శుక్రవారం నిర్ధారించారు. దీంతో వెంటనే డీఎంవో పీవీ సత్యనారాయణ, లావేరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి మౌనికతోపాటు మరికొంతమంది వైద్యసిబ్బంది బెజ్జిపురం చేరుకున్నారు. ఆ వృద్ధుడి ఇంటికి వెళ్లి.. మరోసారి వైద్యపరీక్షలు చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండడంతో వైద్యసిబ్బందితోపాటు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా స్క్రబ్‌టైఫస్ వ్యాధి నిర్ధారణ కావడంతో గ్రామంలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి పరీక్షలతోపాటు మందులను పంపిణీ చేశారు. అలాగే వీధుల్లో పారిశుధ్య నిర్వహణ చేపట్టారు. డీఎంవో సత్యనారాయణ మాట్లాడుతూ.. స్క్రబ్‌టైఫస్ వ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.