క్వాంటమ్ అధ్యయనంతో వైజ్ఞానిక మార్పులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:33 PM
క్వాంటమ్ అధ్యయనంతో వైజ్ఞానిక రంగంలో సమూల మార్పులకు అవకాశం కలుగుతుందని గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.సంధ్య అన్నారు.
ఎచ్చెర్ల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): క్వాంటమ్ అధ్యయనంతో వైజ్ఞానిక రంగంలో సమూల మార్పులకు అవకాశం కలుగుతుందని గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.సంధ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఫిజిక్స్ విభా గం ఆధ్వర్యంలో క్వాంటమ్ టెక్నాలజీపై మూడు రోజుల ప్రత్యేక ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ ప్రోగ్రాం బుధవారం ప్రారంభమైంది. ఆచార్య ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ (బెంగుళూర్)కు చెందిన ప్రొఫెసర్ ఎస్. రాంకుమార్ మాట్లాడుతూ.. గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ లతో పాటు పలు రంగాలకు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో బహుళ ప్రయోజనం ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అడ్డయ్య, ప్రొఫెసర్ పి.సుజాత, ప్రిన్సిపాళ్లు ఎస్.ఉదయభాస్కర్, సీహెచ్.రాజశేఖరరావు, ఫిజిక్స్ విభాగం అధ్యాప కుడు పి.శివప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.