Share News

కొత్త ఉపాధ్యాయులకు నేడు పాఠశాలలు కేటాయింపు

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:58 PM

Appointment orders issued to 528 new teachers మెగా డీఎస్పీ ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు శుక్రవారం పాఠశాలలు కేటాయించనున్నారు. శ్రీకాకుళంలోని నాలుగు కేంద్రాల్లో 528 మంది కొత్త ఉపాధ్యాయులు ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు.

కొత్త ఉపాధ్యాయులకు నేడు పాఠశాలలు కేటాయింపు

జిల్లాలో 528 మందికే నియామక ఉత్తర్వులు

నరసన్నపేట, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్పీ ద్వారా ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు శుక్రవారం పాఠశాలలు కేటాయించనున్నారు. శ్రీకాకుళంలోని నాలుగు కేంద్రాల్లో 528 మంది కొత్త ఉపాధ్యాయులు ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు గురువారం వెబ్‌ఆప్షన్‌ నమోదు చేసుకున్నారు. వారందరికీ శుక్రవారం పాఠశాలల కేటాయింపుతోపాటు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని మైదాన ప్రాంతంలో 458 పోస్టులు, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో 85 పోస్టులకు మొత్తంగా 543 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాగా.. కొంతమంది మూడేసి పోస్టులకు ఎంపికయ్యారు. అటువంటివారు అన్‌విల్లింగ్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 528 మంది మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలో చేరేందుకు విల్లింగ్‌ ఇచ్చి శిక్షణకు హాజరయ్యారు. 528 మంది కొత్త ఉపాధ్యాయుల్లో 447 మంది జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, పురపాలకసంఘ పాఠశాలల్లోను, 81 మందికి గిరిజనసంక్షేమ శాఖ పాఠశాలల్లో ఉత్తర్వులు ఇవ్వనున్నారు. వీరికి కేటగిరి 3,4 పాఠశాలలను కేటాయించనున్నారు. కొత్త ఉపాధ్యాయులంతా కేటాయించిన పాఠశాలలకు ఈనెల 11న రిపోర్టు చేయాలని డీఈవో రవిబాబు స్పష్టం చేశారు.

Updated Date - Oct 09 , 2025 | 11:58 PM