Share News

ముగిసిన పాఠశాలల క్రీడా పోటీలు

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:51 PM

పట్టణంలోని సురంగి రాజా మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న నియోజకవర్గ స్థాయి అంతర్‌ పాఠశాలల బాలబాలికల క్రీడా పోటీలు మంగళ వారంతో ముగిశాయి.

ముగిసిన పాఠశాలల క్రీడా పోటీలు
వాలీబాల్‌ ఆడుతున్న విద్యార్థులు

ఇచ్ఛాపురం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సురంగి రాజా మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న నియోజకవర్గ స్థాయి అంతర్‌ పాఠశాలల బాలబాలికల క్రీడా పోటీలు మంగళ వారంతో ముగిశాయి. వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్‌, షాట్‌ఫుట్‌, జావెలిన్‌త్రో, లాంగ్‌జంప్‌, హై జంప్‌ తదితర పోటీలు బాలబాలి కలకు వేర్వేరుగా నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఎమ్మెల్సీ నర్తు రామారావు బహుమతులు అందిం చారు. కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి, ఎంఎస్‌వో కృష్ణపొడియా, హెచ్‌ఎం జె.ప్రకాష్‌, సూర్యారావు, పీఈటీలు గణేష్‌, శ్రీనివాసరావు, కె.పద్మ నాభం రెడ్డి, వజీర్‌, సుధాకర్‌, షాజహాన్‌, యాదవ్‌, రమేష్‌, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రిగ్స్‌ పోటీల్లో ప్రతిభ

బూర్జ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గస్థాయి గ్రిగ్స్‌ క్రీడా పోటీల్లో బూర్జ మండలం కొల్లివలస బీఆర్‌ అంబే ద్కర్‌ గురుకులం విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు ప్రిన్సిపాల్‌ నూక రామకృష్ణ తెలిపారు. వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌ సీనియర్ల విభాగంలో విజేతలుగా, ఖోఖో, 800, 400 మీటర్ల రన్నింగ్‌లో రెండో స్థానం, వంద మీటర్ల రన్నింగ్‌లో మూడో స్థానం పొందారన్నారు. వాలీబాల్‌ జూనియర్‌ విభాగంలో విజేతలుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా విద్యా ర్థులను డీసీవో యశోదలక్ష్మి, ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.

Updated Date - Dec 09 , 2025 | 11:51 PM