Schemes అర్హులందరికీ పథకాలు : అచ్చెన్న
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:10 AM
Schemes అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

కోటబొమ్మాళి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ సమ స్యలు విన్నవించుకున్నారు. సమస్యలపై మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలున్నంత త్వర గా ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. ఉద్యోగ, ఉపాధి అవ కాశాల కల్పన, మెరుగుదలే ఽధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోం దన్నారు. ప్రధానంగా ఇళ్లు, పింఛన్లు, ఉపాధి అవకాశాలు, రోడ్లు మంజూరు చేయాలని ప్రజలు కోరారు. గ్రామాల్లో మౌలిక సదు పాయాలు కల్పించేందుకు నిధులున్నందున సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
నరసన్నపేట/పోలాకి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. బుధవారం పోలాకి మండలం కత్తిరివానిపేటలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వ హించి వినతులు స్వీకరించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు, స్థలాలు మంజూరు చేయాలని గ్రామాల్లో రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టా లని ప్రజలు వినతిపత్రాలను అందించారు. ఈ వినతులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
వినతులను త్వరితగతిన పరిష్కరించాలి
పాతపట్నం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాల యంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రధానంగా తాగునీటి సమస్యలపై సత్వర చర్యలుండాలని సూచించారు. కార్యక్రమం లో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.