అర్హులందరికీ పథకాలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:42 PM
అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమపథకాలు అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నాయకులు తెలిపారు. సోమవారం జిల్లాలోని పలుచోట్ల తొలి అడుగుకార్యక్రమం నిర్వహించారు.ఈసందర్భంగా కరపత్రాలు అందజేసి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఫఎల్.ఎన్.పేట, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా రాజకీయాలకతీతంగా అమలుచేస్తున్నామని టీడీపీ జిల్లా పార్లమెం ట్ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి తెలిపారు. మండలంలోని గొట్టిపల్లిలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికారప్రతినిధి ఎస్.కిషోర్‌కుమార్, కె. తిరుపతిరావు, జి.మోహనరావు, ఎం. సూర్యనారాయణ, జి.రాము, జి.వాసుదేవరావు, ఎం. జగదీశ్వరరావు పాల్గొన్నారు.
ఫపాతపట్నం,జూలై 28(ఆంధ్రజ్యోతి):ప్రతి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నంలోని ఇందిరమ్మ ఆదర్శగనర్‌లో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించారు.
ఫజలుమూరు (సారవకోట) జూలై 28(ఆంధ్రజ్యోతి): సారవకోట మండలం లోని వడ్డినవలస, మాకివలస, వెంకటాపురంల్లో టీడీపీ మండలాధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ సుపరిపాలనలో తొలిఅడుగు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిక్కు జనార్దనరావు, కె.రాము, బలగ భాస్కర్ పాల్గొన్నారు.