Share News

సచ్చిదానంద ఆశయాలు స్ఫూర్తిదాయకం

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:40 PM

ఆచార్య సచ్చిదానంద స్వామి ఆశయాలు స్ఫూర్తిదాయ కమని. విజ్ఞానం, తార్కికత, విలువలు, సాంస్కృతిక పరిపక్వత వాటితోనే సాధ్యమని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు వీసీ ప్రొఫె సర్‌ వి.బాల మోహన్‌దాస్‌ అన్నారు.

సచ్చిదానంద ఆశయాలు స్ఫూర్తిదాయకం
మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్‌

ఎచ్చెర్ల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఆచార్య సచ్చిదానంద స్వామి ఆశ యాలు స్ఫూర్తిదాయ కమని. విజ్ఞానం, తార్కికత, విలువలు, సాంస్కృతిక పరిప క్వత వాటితోనే సాధ్యమని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వపు వీసీ ప్రొఫె సర్‌ వి.బాల మోహన్‌దాస్‌ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ‘ద రోల్‌ ఆఫ్‌ ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ రెలీజియన్‌ ఫెర్సిఫెక్టివ్‌ ఆఫ్‌ కేఎస్‌ మూర్తి’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. సంస్కృత యూనివర్సిటీ (కోల్‌కత్తా) వ్యవస్థాపక వీసీ ప్రొఫెసర్‌ దిలీప్‌ కుమార్‌ మహంత, ఉత్కళ యూనివర్సిటీ (ఒడిశా) విశ్రాంత ఆచా ర్యులు గణేష్‌ ప్రసాద్‌ దాస్‌ మాట్లాడుతూ.. అంత ర్జాతీయ ఖ్యాతి పొందిన వారిలో మూర్తి ఒకరన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ ఏయూ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని, ఏయూ విశ్రాంత ప్రొఫెసర్‌ ఎంబీ కృష్ణయ్య, వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డ య్య, సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సంతోష్‌ రంగనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈక్యూఫర్‌తో వర్సిటీ అవగాహన ఒప్పందం

ఎచ్చెర్ల, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూని వర్సిటీ, కాలిఫోర్నియా (అమెరికా) లోని ఈక్యూఫర్‌ పీస్‌ అంతర్జాతీయ సంస్థలు ప్రత్యేక అధ్యయనపర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బీఆర్‌ఏయూ రిజి స్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.అడ్డయ్య, ఈక్యూఫర్‌ ఫీస్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చల్లా కృష్ణ వీర్‌ అభిషేక్‌ వీసీ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజని సమక్షంలో సంతకాలు చేశారు. సంపూర్ణ విద్య, నైతిక నాయకత్వం, సామాజిక శ్రేయస్సును పెంపొందించడంలో భారతీయ జ్ఞాన వ్యవస్థలు (ఐకేఎస్‌)పై అధ్యయనం చేయనున్నాయి. ఈ ఒప్పందం ప్రత్యే కించి బీఆర్‌ఏయూలోని సచ్చిదానంద మూర్తి బహుళ సాంస్కృతిక, మత సామ రస్య, శాంతి అధ్యయనాల కేంద్రం లక్ష్యం, కార్యకలా పాలను బలోపేతం చేస్తుం దని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Dec 19 , 2025 | 11:40 PM