పారిశుధ్య పనులు చేపట్టాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:35 PM
: అంధవరం పంచాయతీలో తక్షణమే పారిశుధ్యం పనులు చేపట్టాలని గ్రామస్థులు, మహిళలు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
జలుమూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అంధవరం పంచాయతీలో తక్షణమే పారిశుధ్యం పనులు చేపట్టాలని గ్రామస్థులు, మహిళలు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామ సచివాలయానికి వెళ్లిన రహదారి పక్కన, రామకృష్ణాపురం వద్ద చెత్త, మురుగునీరు ఉన్నా అధికారులు, సర్పంచ్ పట్టించుకోకపోవడం లేదని వాపోయారు. సమాచారం తెలుసుకున్న ఇన్‌చార్జి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు అంధవరం చేరుకొని గ్రామస్థులతో మాట్లాడారు. తక్షణమే పారిశుధ్య పనులు చేపడతామని హామీఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.