Share News

పారిశుధ్యం మెరుగుపరచాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:18 AM

గ్రామస్థాయిలో పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరు గుపర్చాల్సిందేనని జడ్పీఈ సీఈవో ఎల్‌ఎల్‌ శ్రీధర్‌రాజా అన్నారు.

పారిశుధ్యం మెరుగుపరచాలి
బొరివంక గ్రామంలో ఒరియావీధి వాసులతో మాట్లాడుతున్న సీఈవో

  • ఐవీఆర్‌ కాల్స్‌పై జడ్పీ సీఈవో పరిశీలన

కవిటి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరు గుపర్చాల్సిందేనని జడ్పీఈ సీఈవో ఎల్‌ఎల్‌ శ్రీధర్‌రాజా అన్నారు. బొరివంక, ఇద్ది వానిపాలెం గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ కాల్స్‌పై ఈ గ్రామాల నుంచి పారిశుధ్యంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. పంచాయతీలకు ఇచ్చిన తోపుడుబండ్లు ద్వారా ఇంటింటా చెత్తను సేకరించి చెత్త కేంద్రాలకు తరలించాలన్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల కార్యదర్శులను ఆదేశించారు. ఈయన వెంట ఎంపీడీవో కె.శ్రీనివాసరెడ్డి, ఈవోపీఆర్డీ అబ్దుల్‌, సచివాలయ సిబ్బంది పాల్గొ న్నారు. ఇదిలావుంటే ఐవీఆర్‌ కాల్స్‌పై డీపీవో భారతిసౌజన్య రెండురోజుల కిందట పర్యటించి పారిశుధ్య పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఎల్‌.రాజేష్‌, గుణవతిలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో జడ్పీ సీఈవో పర్యటించడం విశేషం.

Updated Date - Jun 26 , 2025 | 12:18 AM