Share News

ఇసుక ట్రాక్టర్లు తప్పించుకుపోయాయి

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:07 AM

Sand tractors disappeared ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకోగా.. అందులో మూడు వాహ నాలు తప్పించుకుపోయాయి. తహసీల్దార్‌ కార్యా లయం ఆవరణలో ఉంచిన ఒడిశాకు చెందిన మూడు ట్రాక్టర్లు తీసుకెళ్లిపోవడం చర్చనీయాం శంగా మారింది.

ఇసుక ట్రాక్టర్లు తప్పించుకుపోయాయి
తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉన్న నాలుగు ట్రాక్టర్లు

పట్టుకున్నవి 7.. ఉన్నవి 4 వాహనాలు

అందులో రెండు విడిచిపెట్టేసిన వైనం

తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోనే మాయం

హిరమండలం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను అధికారులు పట్టుకోగా.. అందులో మూడు వాహ నాలు తప్పించుకుపోయాయి. తహసీల్దార్‌ కార్యా లయం ఆవరణలో ఉంచిన ఒడిశాకు చెందిన మూడు ట్రాక్టర్లు తీసుకెళ్లిపోవడం చర్చనీయాం శంగా మారింది. ఈ విషయమై తహసీల్దార్‌ వద్ద ప్రస్తావించగా.. అవి ఒడిశా రాష్ట్రానికి చెందినవి కావడంతో పట్టుకోవాలని పోలీసులకు సమాచా రం ఇచ్చామని చెప్పడం గమనార్హం. వివరాలోకి వెళితే.. హిరమండలంలోని గొట్టాబ్యారేజీ దిగువన మెట్టతోట సమీపంలో వంశధార నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను పోలీసుల సహకారంతో వీఆర్వోలు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో వాటిని తహసీల్దార్‌ కార్యాలయానికి తరలించారు. అందులో నాలుగు ట్రాక్టర్లు హిరమండలం మం డలంలోని ధనుపురం గ్రామానికి చెందినవి. మిగిలినవి ఒడిశా రాష్ట్రానికి చెందినవి. సాయం త్రం 6.30 గంటల సమయంలో ఒడిశాకు చెంది న మూడు ట్రాక్టర్లను తప్పించుకుపోయారు. తహసీల్దార్‌ జోగారావు, వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది కార్యాలయంలో ఉంటుండగానే ఆ ట్రాక్టర్లు తీసుకెళ్లి పోవడం గమనార్హం. ఈ విషయం తెలిసి తహసీల్దార్‌ ఖంగు తిన్నారు. వెంటనే ఎస్‌ఐ వెంకటేష్‌కు ఫోన్‌ చేశారు. మధ్యాహ్నం పట్టుకు న్న మూడు ట్రాక్టర్లను కార్యాలయం ఆవరణ నుంచి తీసుకెళ్లిపోయారని, వాటిని పట్టుకోవాలని చెప్పారు. అప్పటికే ట్రాక్టర్లు చాలా దూరం వెళ్లి పోయి ఉంటాయని మిగతా ట్రాక్టర్ల డ్రైవర్లు చెప్పారు. పోలీసులు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి.. తప్పించుకు పోయిన ట్రాక్టర్లు నెంబర్లు ఇస్తే పట్టుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. దీనిపై తహసీల్దార్‌ వద్ద ప్రస్తావించగా.. ఒడిశాకు చెందిన మూడు ట్రాక్ట ర్లు తప్పించుకుపోయినట్టు పోలీసులకు సమా చారమిచ్చామని తెలిపారు.

ట్రాక్టర్లు విడిచిపెట్టడంపై వివాదం

ధనుపురం గ్రామానికి చెందిన నాలుగు ట్రాక్ట ర్లలో రెండింటిని తహసీల్దారు విడిచిపెట్టడంపై వివాదం నెలకొంది. నదిలో ట్రాక్టర్లను పట్టుకున్న సమయంలో రెండు ఇసుక లోడ్‌ చేసినవి కాగా, మిగతా రెండు ఖాళీ ట్రాక్టర్లు. వాటిలో రెండు ఖా ళీ ట్రాక్టర్లును రాత్రి 8గంటల సమయంలో విడిచి పెట్టి ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్లును కార్యాల యంలోనే ఉంచడంపై వివాదం నెలకొంది. అధి కారపార్టీ నాయకులు ఫోన్‌ చేయడంతో తహసీ ల్దారు ఖాళీగా ఉన్న ట్రాక్టర్లును విడిచి పెట్టారని మిగిలిన ఇద్దరు డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. అన్ని ట్రాక్టర్లు విడిచి పెట్టాలని.. లేదంటే అన్నింటిపైనా చర్యలు తీసుకోవాలని.. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 19 , 2025 | 12:07 AM